హ్యాపీ బర్త్ డే : నందమూరి కళ్యాణ్ రామ్ 

హ్యాపీ బర్త్ డే : నందమూరి కళ్యాణ్ రామ్ 

తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే, ఆరాధించే వ్యక్తి ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం ఎన్టీఆర్.  నందమూరి తారక రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.  తెలుగు వారి ఆరాధ్య నటుడిగా, తెలుగు  ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నందమూరి తారక రామారావు నట వారసులు ఎందరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  

అలా అడుగుపెట్టిన వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు.  కళ్యాణ్ రామ్ బాలనటుడిగా 1989లో  బాలగోపాలుడు సినిమాలో నటించి మెప్పించాడు.  ఆ సినిమా మంచి విజయం సాధించింది.   ఈ సినిమా తరువాత 2003 లో తొలిచూపులోనే అనే సినిమాతో కళ్యాణ్ రామ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు.  ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది.  అక్కడి  ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేశాడు.  కెరీర్లో అతనొక్కడే, అసాధ్యుడు, లక్ష్మి కళ్యాణం,  పటాస్ సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.  తాతపై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా మారాడు.  తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.  అయితే, మొదటిసారి బయటి హీరోతో కిక్ 2 సినిమా తీశాడు.  ఆ తరువాత తమ్ముడు ఎన్టీఆర్ తో జైలవకుశ సినిమా తీసి నిర్మాతగా పెద్ద హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.  సినిమా ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా తనదైన పాత్రను పోషిస్తూ తాతకు తగ్గ మనవడిగా తెలుగు సినిమా చిత్రపరిశ్రమలో దూసుకుపోతున్నాడు ఈ నందమూరి హీరో.  ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు.  ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.