హ్యాపీ బర్త్ డే 'అసిన్'

హ్యాపీ బర్త్ డే 'అసిన్'

అసిన్... ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలలో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.  నేడు ఈ బ్యూటీ బర్త్ డే . స్టార్ హీరోస్ తో కలిసి నటించి ఎంతగానో ఆకట్టుకుంది అసిన్.  చాలా అభిమానులను సొంతం చేసుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్,  మాస్ మహారాజ్ రవి తేజ కాంబినేషన్ లో వచ్చిన "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి" చిత్రం  ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యింది. నాగార్జున, వెంకటేష్, బాల కృష్ణ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. "ఘర్షణ" సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. 
అటు తమిళ్ లో కూడా సూర్య, విక్రమ్, కమల్ హాసన్, విజయ్ వంటి స్టార్ హీరోస్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గజిని, దశావతారం వంటి సినిమాలతో తమిళ్ లో కూడా టాప్ హీరోయిన్ గా తన ముద్ర వేసుకుంది. 

ఇక బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు తన హవా కొనసాగించింది. తన డెబ్యూ మూవీనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ తో కలిసి తనని సౌత్ లో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన గజిని సినిమా రీమేక్ లో నటించింది. ఆ సినిమా హిందీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమాతో ఇండియా సినిమా పరిశ్రమ లోనే మొదట 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా హీరోయిన్ గా పేరు సంపాదించి సరి కొత్త రికార్డు సృష్టించింది. తర్వాత సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్ లతో నటించి పూర్తిగా బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే మైక్రో మాక్స్ అధినేత రాహుల్ శర్మ ని పెళ్లి చేసుకొని సినిమాలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది అసిన్..