రామేశ్వరంలో మహాద్భుతం... సూర్యుడి చుట్టూ వలయం... 

రామేశ్వరంలో మహాద్భుతం... సూర్యుడి చుట్టూ వలయం... 

రామేశ్వరంలో సోమవారం రోజున ఓ అద్భుతం జరిగింది.  సూర్యుడి చుట్టూ రింగు లాంటి ఓ వలయం ఏర్పడింది.  వలయం సంపూర్ణంగా ఉండటంతో పాటుగా ఎక్కువ సమయం కనిపించడంతో ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.  ఇలాంటి అద్భుతం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. వలయం వంటివి ఏర్పడినా ఎక్కువ సమయం ఉండేవి కాదని, కానీ, సోమవారం రోజు సూర్యుడి చుట్టూ ఏర్పడిన వలయం ఎక్కువ సమయం ఉందని, ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించి కనువిందు చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగబోతున్న తరుణంలో ఆకాశంలో అద్భుతం జరగటం శుభసూచకం అని కొందరు చెప్తున్నారు.