బీజేపీ.. బ్రోకర్ల జనతా పార్టీ గా తయారైంది...

బీజేపీ.. బ్రోకర్ల జనతా పార్టీ గా తయారైంది...

టిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మరోసారి బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిని అవమానపరిచే విధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారని..  కౌన్సిల్ ని కించరిపచే విధంగా మాట్లాడినందుకు సంజయ్ ని అరెస్ట్ చేసి లోపల వేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ బ్రోకర్ల జనతా పార్టీగా తయారైందని.. బీజేపీ అధ్యక్షుడు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదని చురకలు అంటించారు. బండి సంజయ్ కి ఓటు హక్కు ఉందో లేదో తెలియదని... బండి సంజయ్ పేరు...తొండి సంజయ్ అని పిలవాలని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఎప్పుడైనా కరీంనగర్ దాడి హైదరాబాద్ వచ్చిండా? బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్ కి రావడానికి కారణం కేసీఆరేనని పేర్కొన్నారు. పొద్దున లేచి కేసీఆర్ కాళ్లకు దండం పెట్టాలన్నారు. ఐటీఐఆర్ కాన్సెప్ట్ నే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందనేది సంజయ్ తెలుసుకోవాలని... విశాఖ ఫ్యాక్టరీని ఆనాటి రేటుకు ప్రైవేట్ సంస్థలకు అమ్మడానికి కుట్ర చేస్తుందని ఫైర్‌ అయ్యారు.  మోడీలో వీరప్పన్ ను చూస్తున్నామని వీరప్పన్ కూతురు అన్నది..కాకపోతే దేశమంతా మోడీలో వీరప్పన్ ను చూస్తుందని మండిపడ్డారు.తెలంగాణ గురించి పార్లమెంటులో  బండి సంజయ్ ఒక్కరోజు మాట్లాడలేదన్నారు.