ఆయన్ని తట్టుకోలేం..

ఆయన్ని తట్టుకోలేం..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ జానీమూన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద అల్లరి మూకల రచ్చ.. ఆ ప్రాంతంలో జరిగిన ఘర్షణ వెనుక జగన్ గ్యాంగ్ ప్రమేయముందని ఆమె ఆరోపించారు. కాపు ఉద్యమంలో రైలును తగలబెట్టినట్లే ఇప్పుడు కూడా జగన్ అల్లర్లు సృష్టిస్తున్నారని.. వైసీపీ అధినేత కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హింసలు ఎక్కువ జరిగాయని.. నాడు చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు వైఎస్ 2 వందల మంది మైనారిటీలను బలి తీసుకున్నారన్నారు. దాచేపల్లి, పాత గుంటూరు ఘటనలు రాష్ట్రంలో అంతటి సంచలనం సృష్టించినా.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. జగన్ ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదని ఆమె ప్రశ్నించారు.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన్ను తట్టుకోలేమని ఆరోపించారు.