పూర్తిగా పరిశీలించాకే కేసు నమోదు..

పూర్తిగా పరిశీలించాకే కేసు నమోదు..

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేస్తామన్నారు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు... టీడీపీ నేతల ఫిర్యాదుపై ఆయన మాట్లాడుతూ... గత నెల 23వ తేదీకి ముందు అమరావతిలో వైసీపీ, తెలంగాణ అధికారులు సమావేశమై డేటా చోరీకి కుట్ర చేసినట్టు ఫిర్యాదు చేశారని.. అనంతరం డేటా తీసుకెళ్లారని దీని పై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదును తుళ్లూరు పోలీసు స్టేషన్ కు పంపి దర్యాప్తు చేస్తామని వెల్లడించిన ఎస్పీ... ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.