వధువు తల్లితో వరుడి తండ్రి అప్పట్లో లేచిపోయారు... తిరిగి వచ్చారు.. కానీ... మళ్ళీ...!!

వధువు తల్లితో వరుడి తండ్రి అప్పట్లో లేచిపోయారు... తిరిగి వచ్చారు.. కానీ... మళ్ళీ...!!

కొన్నాళ్ల క్రితం వధువు తల్లి, వరుడు తండ్రి పెళ్ళికి ముందు లేచిపోయిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూరత్ లో ఈ సంఘటన జరిగింది.  వీరిద్దరూ ఇలా లేచిపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది.  అలా జనవరిలో లేచిపోయిన ఆ ఇద్దరు కొన్ని రోజుల క్రిందట తిరిగి వచ్చారు.  అయితే, వధువు తల్లిని భర్త ఇంట్లోకి రానివ్వలేదు.  దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. 

కానీ, వరుడు తండ్రి మాత్రం ఈ విషయంలో రాజీపడలేదు.  తిరిగి ఆమెను కలుసుకున్నాడు.  తన వలన ఇబ్బందులు పడిన ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నాడు.  ఆమెను తిరిగి తీసుకొచ్చి సూరత్ లో అద్దెకు ఇల్లు తీసుకొని అందులో ఉంచినట్టుగా తెలుస్తోంది.  అసలు వీరిద్దరూ ఇలా లేచిపోవడం వెనుక ఓ బలమైన కారణం ఉన్నది.  ఒక సీరియల్ కథకు కావాల్సిన మేటర్ వీరి జీవితంలో దొరుకుతుంది.  వయసులో ఉండగా వీరిద్దరూ ప్రేమించుకున్నారట.  కానీ, పెద్దలు ఒప్పుకోకపోవడంతో వేరే వాళ్ళతో పెళ్లిళ్లు జరిగాయి.  ఆ తరువాత కూడా ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు.  కాగా, వీరిద్దరూ బంధువులు కాబోతుండటం, అందులో వరుసకు అన్నా చెల్లెల్లు కాబోతుండటంతో తట్టుకోలేక పారిపోయారని వార్తలు వచ్చాయి.