వ్యవసాయ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్యవసాయ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూములకు పెండింగ్‌ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ లో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఆధార్‌ నంబర్‌ అనుసంధానంలో లోపాలు, పేర్లు, భూ విస్తీర్ణం తప్పుగా నమోదవడం, సర్వే నంబర్‌ కనిపించకపోవటం తదితర 9 రకాల సమస్యలకు పరిష్కారం చూపేలా ఆప్షన్‌ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు వారి సమస్యల పరిష్కారం అవడం కోసం మీసేవ ద్వారా అప్ప్లై చేసుకొని సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాలి. ఈ దరఖాస్తులు నేరుగా కలెక్టర్‌ లాగిన్ కు చేరుతాయి. కలెక్టర్‌ వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటారు. కొనుగోలు, వారసత్వం, భాగ పంపకం ద్వారా సంక్రమించిన భూముల వివరాలు తప్పుగా నమోదైతే 8వ ఆప్షన్‌ కింద దరఖాస్తు చేయాలి.పట్టా భూములు పొరపాటున ప్రభుత్వ భూమిగా పేర్కొనడం వంటి సమస్యలపై 9వ ఆప్షన్‌ కింద దరఖాస్తు చేసుకోవాలి.