గ్రేటర్‌ : కాంగ్రెస్‌లో మొదలైన ఇంటి పోరు

గ్రేటర్‌ : కాంగ్రెస్‌లో మొదలైన ఇంటి పోరు


గ్రేటర్‌ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో లొల్లి మీద లొల్లి మొదలైంది. అభ్యర్ధుల విషయంలో నేతల మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా బీ ఫారాల పంచాయితీ హస్తం పార్టీకి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాను చెప్పినవారికి బీ ఫారాలు ఇవ్వకపోతే సిటీ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తానంటూ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పీసీసీకి హెచ్చరిక జారీ చేశారు. అలాగే గోషామహల్ డివిజన్లో  తన వర్గీయులకు బీ ఫారాలు ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు ఇటు ముఖేష్‌ కొడుకు విక్రమ్ కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నారు. అలాగే నామినేషన్ వేసిన ఐదు డివిజన్లలో అభ్యర్ధులను కూడా ఉపసంహరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. సమిష్టిగా గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన సమయంలో ఇలా ఇంటిపోరు ఇప్పుడు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీని నుంచి ఎలా బయటపడాలా అని సీనియర్లు తలలు పట్టుకున్నారు.