ఉత్తర ప్రదేశ్ లో గ్రహాంతరవాసి: పరుగులు తీసిన ప్రజలు...చివరకు...!!

ఉత్తర ప్రదేశ్ లో గ్రహాంతరవాసి: పరుగులు తీసిన ప్రజలు...చివరకు...!!

గ్రహాంతరవాసులు గురించి ఫిక్షన్ సినిమాల్లో చూశాం.  గ్రహాంతర వాసులు ఫ్లైయింగ్ సాసర్స్ లో వస్తారని, వింత వింత ఆకృతిలో ఉంటారని సినిమాల్లో చూశాం.  ఇక అమెరికాలోని ఏరియా 51 లో గ్రహాంతర వాసులు ఉన్నారని, వాటిపై ప్రయోగాలు చేస్తున్నారని రకరకాల వార్తలు వస్తుంటాయి.  ఆ వార్తలు నిజమా కాదా అన్నది ఇప్పటి వరకు ఎవరూ స్పష్టం చేయలేదు.  గ్రహాంతరవాసులకు సంబంధించిన కథనాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి.  ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లో ఆకాశంలో ఎగురుతున్న ఓ ఆకారం కనిపించింది.  దాన్ని చూసిన ప్రజలు షాక్ అయ్యారు.  గ్రహాంతరవాసి దూసుకు వస్తోందని చెప్పి పారిపోయారు.  అయితే, అది కొంత సేపటి తరువాత నోయిడా సమీపంలోని ఓ కాలువలో పడిపోయింది.  దాని దగ్గరకు వెళ్లి చూసేందుకు మొదట ప్రజలు భయపడ్డారు.  తీరా చూసి షాక్ అయ్యారు.  అది గ్రహాంతరవాసి కాదు బెలూన్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.  అచ్చంగా ఐరన్ మ్యాన్ ఆకృతిలో ఉన్న బెలూన్ కావడంతో ఆకాశంలో దాన్ని చూస్తే ఎవరైనా అలానే భ్రమపడతారు.  దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.