ఎవరో మీడియాకు సమాచారాన్ని లీక్ చేస్తున్నారు... 

ఎవరో మీడియాకు సమాచారాన్ని లీక్ చేస్తున్నారు... 

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ... మా బోర్డు నుండి ఎవరో సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారు. అది క్యాన్సర్ గా మారుతుంది అని అన్నారు. సీనియర్ పదవులలో ఉన్న కొంతమంది చేస్తున్న ఈ పనులు మా సంస్థకు అపఖ్యాతిని కలిగించాయని స్మిత్ అన్నారు. ఎందుకంటే లీక్ అయిన కొన్ని విషయాలు కేవలం సంస్థలోని వారికి మాత్రమే తెలుసు అని చెప్పాడు. సుమారు 18 నెలల కాలంగా సంస్థలో ఇది సమస్యగా ఉంది. ఇది చాలా మంది ప్రజలను ప్రభావితం చేసింది. ఈ విషయంపై నేను ఇంతకుముందు బోర్డుతో నా అసంతృప్తిని వ్యక్తం చేశాను అని తెలిపాడు. మాజీ సీఈఓ తబాంగ్ మోరోను సస్పెండ్ చేసిన తరువాత గత ఏడాది డిసెంబర్‌లో గ్రేమ్ స్మిత్ బోర్డు అధ్యక్షునిగా ఎంపికయ్యాడు. 2002 నుండి 2014 మధ్య 117 టెస్టుల ఆడిన స్మిత్ 9265 పరుగులు చేసాడు.