కమీషన్ల కోసమే చంద్రబాబు శంకుస్థాపనలు

కమీషన్ల కోసమే చంద్రబాబు శంకుస్థాపనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి.. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్నారని.. 2014 స్వాతంత్ర్య దినోత్సవం నాడు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలేనని.. అరచేతిలో వైకుంఠం చూపించిన ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకుని జిల్లాకు వస్తున్నాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.. ఆయన జిల్లాలో శంకుస్థాపన చేసిన వాటిలో ఎన్ని పూర్తయ్యాయో చెప్పే ధైర్యం సీఎంకు ఉందా అని చరితా రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని.. ఆయన పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. నాలుగేళ్ల వైఫల్యాలపై సీఎం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని... ఆయన ఆరాచకపాలనకు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని ఆమె అన్నారు.. కాగా, ఒక రోజు పర్యటన నిమిత్తం రేపు ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు.. పూడిచర్ల వద్ద జైరాత్ ఇస్పాత్ లిమిటెడ్‌కు.. ఓర్వకల్లులో ఉర్దూ, రూసా క్లస్టర్డ్ వర్శిటీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.