షాక్‌: పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై 13 వడ్డింపు...

షాక్‌: పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై 13 వడ్డింపు...

కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ అయ్యింది. దీంతో చమురు ఉత్పత్తికి తగ్గరీతిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనప్పటికీ దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గడం లేదు. తగ్గిన ధరల వెసులుబాటును ప్రజలకు మళ్లించకుండా.. కేంద్రం ఎక్సైజ్‌రేట్లు పెంచకుంటూ పోతుంది. ఇలా తాజాగా మరోసారి కొరడా జులిపించింది. ఏకంగా లీటర్ పెట్రోలు పై 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇందులో రెండు రూపాయలు ఎక్సైజ్ సుంకంకాగా, ఎనిమిది రూపాయలు రోడ్ సెస్ విధించింది. కొత్తగా కేంద్రం పెంచిన ధరలతో... దేశంలో లీటర్ పెట్రోలుకు దాదాపు 33 రూపాయలు ఎక్సైజ్ సుంకం రూపంలోనే కేంద్రం జేబులోకి వెళ్తుంది. నరేంద్రమోడీ 2014లో ప్రధాని అయినప్పుడు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం కేవలం తొమ్మిదన్నర రూపాయలు మాత్రమే ఉంటేది. అదిప్పుడు పెరుగుతూ పెరుగుతూ వచ్చి.. 33 రూపాయలకు చేరుకుంది. చమురు ధరల పతనం మొదలయ్యాక... ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. తగ్గిన చమురు ధరలు సామాన్యులకు దక్కకుండా కేంద్రం ఎక్సైజ్  సుంకం రూపంలో కేంద్రం తన ఖజానాకు మళ్లిస్తోంది. కరోనా లాక్‌డౌన్ వేళ .. ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిపోయిన సమయంలో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాగైనా గట్టెక్కాలని రేట్లు తగ్గించకుండా... పరోక్ష పద్దతిలో డబ్బు మళ్లించుకుంటుంది.