కరీంనగర్ జిల్లాలో ఆ 3 కిలోమీటర్లు రెడ్ జోన్ !

కరీంనగర్ జిల్లాలో ఆ 3 కిలోమీటర్లు రెడ్ జోన్ !

కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని పోలీసులు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతానికి మూడుకిలోమీటర్ల వరకూ ఎవరినీ అనుమతించడం లేదు. కేసు నమోదైన ఇంటికి సమీపంలోనే.. 80 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను.. సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు.  ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. ఏమైనా కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి,, చెబితే తామే స్వయంగా తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. కాదని బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖరాంపురా, భగత్ నగర్, కశ్మీర్ గడ్డ..ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైఅలర్ట్ ప్రకటించారు.

ఇండోనేషియా వాసులు ఈప్రాంతంలోనే తిరగడంతో.. ఇతరులకు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సాయంత్రం నుంచి ఇంటింటికీ తిరిగి నిత్యవసరాలు అందిస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ అధికారులు. నిన్న ఉగాది పండుగ అయినప్పటికీ పోలీసుల హెచ్చరికలతో ప్రజలు బయటకు వచ్చేందుకు సాహసించలేదు ఇంటింటికీ వెళ్లి ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంలు.. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కొందరిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేయగా.. మరికొందరు స్వీయనిర్భందంలో ఉన్నారు. బయటకు వస్తే, ప్రాణాలకే ముప్పని అధికారులు హెచ్చరిస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే లాక్ డౌన్‌కు . జిల్లా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నారు. అధికారులు.

మార్చి 1 తర్వాత విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారిని గుర్తించి స్టాంపింగ్‌ చేశారు అధికారులు..  కరోనా వైరస్‌ ప్రభావిత దేశాలే కాకుండా ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి స్టాంపింగ్‌ చేయాలని మండలస్థాయిలో ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. వివిధ దేశాల నుంచి రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి జిల్లాకు 371 మంది విదేశీ ప్రయాణికులు వచ్చారు. వీరిలో గంగాధర మండలంలో 58 మంది, రామడుగులో 48 మంది, చొప్పదండిలో 39 మంది ఉన్నారు. ఇప్పటికే వీరిలో పలువురికి ఎడమ చేతి మణికట్టుపైన ఇండిబుల్‌ ఇంక్‌తో స్టాంపులు వేశారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జియో ట్యాగింగ్‌ కూడా చేయాలని ఆదేశించారు. హెల్త్‌ ఎమర్జెన్సీ దృష్ట్యా మల్టీ ఏజెన్సీల కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు.