కేంద్రం శుభవార్త : మార‌టోరియం రుణాల వ‌డ్డీ ర‌ద్దు

కేంద్రం శుభవార్త : మార‌టోరియం రుణాల వ‌డ్డీ ర‌ద్దు

పండగ సీజన్‌లో రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారటోరియం కాలానికి 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్‌ వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. అక్టోబర్‌ 14న ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, సామాన్యుడి దీపావళి కేంద్రం చేతిలో ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 2కు వాయిదా వేసింది.