ఉద్యోగులకు సర్కార్‌ తీపికబురు...!

ఉద్యోగులకు సర్కార్‌ తీపికబురు...!

ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్... ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా పండుగ సీజన్‌లో డిమాండ్ పెంచడానికి ఆర్థిక శాఖ ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే అమల్లో ఉన్న ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌ను మరింత మందికి అందుబాటులోకి తీసుకువచ్చింది... నాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది... ఎల్‌టీసీ వోచర్లకు సమానంగా నాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా క్యాష్ పేమెంట్‌కు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. 

కేంద్ర ఆర్థిక శాఖ తాజా ప్రకటనతో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా ఎల్‌టీసీ వోచర్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఎల్‌టీఏ స్కీమ్‌లో ఆయా కంపెనీలు వారి ఉద్యోగులకు హాలిడే ట్రిప్ ట్రావెల్ ఖర్చును రీయింబర్స్‌మెంట్ చేయనున్నాయి... అయితే, ఎల్‌టీసీ కింద టాక్స్‌ మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి... 12 శాతం లేదా ఆపై జీఎస్‌టీ ఉన్న వస్తువును కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. అది కూడా డిజిటల్ రూపంలో కొనుగోలు చేస్తేనే ఇది వర్తించనుంది. ఇక, అక్టోబర్ 12 నుంచి 2021 మార్చి 31లోపు ఆయా వస్తువులను కొనుగోలు చేస్తేనే ఇది వర్తింపజేయనున్నారు.