నవంబర్‌ 1న ఏపీ అవతరణ దినోత్సవం: ప్రభుత్వం ఉత్తర్వులు

నవంబర్‌ 1న ఏపీ అవతరణ దినోత్సవం: ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 న నిర్వహించాలని జగన్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని, జిల్లా కేంద్రాల్లో అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించింది. వేడుకల నిర్వహణకు సంభందించి తొమ్మిది మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. 2014 జూన్ 2 న రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్ణయించలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా 1956 నవంబర్ 1 న తెలంగాణ తో కూడిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి వరకు నవంబర్ 1 న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.