ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...ట్రాన్స్‌జెండర్లకు రైస్ కార్డులు.!

 ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...ట్రాన్స్‌జెండర్లకు రైస్ కార్డులు.!

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో వివక్షకు గురవుతూ ఒంటరిగా జీవిస్తున్న ట్రాన్స్ జెండర్లకు అండగా నిలిచేందుకు సిద్ధమౌతోంది. వారి ఆకలి తీర్చేందుకు రైస్ కార్డులను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వలంటీర్ల సహాయంతో వారిని గుర్తించనుంది. ఇప్పటికే అనాథలు, ట్రాన్స్‌జెండర్లు,  పిల్లలు లేని వితంతువులు, ఇల్లులేని వారిని గుర్తించాలని అధికారులు వాలంటీర్లను ఆదేశించారు. గుర్తించిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో రైస్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ రైస్‌ కార్డు మాదిరిగానే ఆరు అంశాల ప్రాతిపదికన అర్హత ఉంటే సరిపోతుంది. 10 రోజుల్లో కొత్త రైస్ కార్డును అందజేస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో 5 వేల మంది కొత్తగా రైస్‌ కార్డు పొందే అవకాశం ఉంది. ఇక రైస్ కార్డులు తీసుకున్నవారు అన్ని సంక్షేమ పథకాలకు అర్హులు అవ్వనున్నారు.