బ్లాక్ బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ.. ?
నందమూరి నటసింహం బాలకృష్ణ తన యాక్షన్ ఫుల్ ఫైట్స్‌కి, పవర్ ఫుల్ డైలాగ్స్‌కి పెట్టింది పేరు. బాలయ్య బాబు సినిమా అంటే థియేటర్ల ముందు అభిమానులు బారులు తీరుతారు. అతడి సినిమా అంటే అంచనాలు తారాస్థాయిని దాటుతాయి. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్వకత్వంలో సినిమా చేయనున్నాడు. వీరి కాంబో ఇది మూడో సినిమా కావడం చాలా స్పెషల్‌గా ఉంది. వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబోలో రానున్న సినిమా కూడా అదే స్థాయిలో ఫిట్ అవుతుందని ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు బలరామయ్య బరిలోకి దిగితే అనే పేరును ఫిక్స్ చేశారు. ఇందులో కూడా బాలయ్య పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. అయితే తాజాగా బాలయ్య కొత్త సినిమా గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో బాలయ్య మూవీ కూడా ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తన దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయని... ఇంకా ఫైనల్ కాలేదని స్వయంగా గోపీచంద్ క్లారిటీ ఇచ్చారు. అన్ని కుదిరితే గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందే అవకాశం ఉంది. మాస్ మూవీస్ దర్శకుడు గోపీచంద్, పవర్ ఫుల్ హీరో బాలయ్య కాంబోలో మూవీ అంటే ఇక ఫ్యాన్స్‌లో పండగే అంటున్నారు సినీ ప్రముఖులు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)