గూగుల్ కీలక నిర్ణయం.. అగ్రరాజ్యానికి భారీ సాయం
కరోనావైరస్తో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాను ఆదుకునేలా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కీలక ప్రకటన చేసింది. దేశంలో విద్య ప్రచారానికి, అందరికీ కొవిడ్ వ్యాక్సిన్ సక్రమంగా పంపిణీ జరిగేలా 150 మిలియన్ డాలర్లు ప్రకటించింది. వీటిలో 100 మిలియన్ డాలర్లు సీడీసీ ఫౌండేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇతర స్వచ్చంధ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. అలాగే టీకాల గురించి తక్కువ వర్గాల వారు సమాచారం పొందేందుకు ప్రజారోగ్య సంస్థలతో భాగస్వామ్యం కోసం మరో 50 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే, కరోనాతో వైరస్‌తో అతలాకుతలమైన అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు టీకాల విషయంలో వర్ణ వివక్షతకు గురవుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ప్రధానంగా రూరల్ కమ్యూనిటీస్‌లో ఒకే ధరకు వ్యాక్సిన్ అందడం లేదని ఆయన ఆరోపించారు గూగుల్ సీఈవో... టీకాల పంపిణీపై యూఎస్‌లో ఇటీవల వెలువడిన నివేదికలే దీనికి నిదర్శనంగా చూపారు. చాలా తక్కువ సమయంలో వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామన్నారు. అలాగే గూగుల్ మ్యాప్స్ ద్వారా టీకా పంపిణీ కేంద్రాల సమాచారాన్ని ప్రజలు సులువుగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు గూగుల్ సీఈవో పిచాయ్ తెలిపారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)