గూగుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌రో ఏడాది వ‌ర‌కు...

గూగుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌రో ఏడాది వ‌ర‌కు...

క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి ప్ర‌ముఖ సంస్థ‌ల‌న్నీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం బాట ప‌ట్టాయి.. దీనికి సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా మిన‌హాయింపు ఏం కాదు.. 2019 చివ‌ర‌ల్లో మొద‌లైన క‌రోనా వైర‌స్.. 2020లో ఆగ‌స్టు స‌మీపిస్తున్నాత‌గ్గ‌డం మాట అటుంచితే.. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది.. దీంతో.. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ పొడిగించాయి.. తాజా‌గా గూగుల్ కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది..  ఇప్ప‌టికే గూగుల్ ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంలో ఉండ‌గా.. ఇప్పుడు 2021 జూలై నెల వరకూ ‘వర్క్ ఫ్ర‌మ్‌ హోం’ అని ప్రకటించింది గూగుల్‌. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, గూగుల్ నిర్ణ‌యం.. మ‌రికొన్ని సంస్థ‌ల‌పై కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయంటున్నారు విశ్లేష‌కులు.