గుడ్‌న్యూస్‌... త‌గ్గిన ఐఫోన్ల ధ‌ర‌లు...

గుడ్‌న్యూస్‌... త‌గ్గిన ఐఫోన్ల ధ‌ర‌లు...

ఐఫోన్ అంటే ఎంతో క్రేజ్.. కొత్త మోడ‌ల్ విడుద‌ల చేస్తున్నారంటే గంట‌ల త‌ర‌బ‌డి, రోజుల త‌ర‌బ‌డి మ‌రీ స్టోర్లముందు నిల‌బ‌డి సొంతం చేసుకుంటారు.. యూత్ నుంచి పెద్ద వ‌య‌స్సు వారి వ‌ర‌కు ఐఫోన్‌కు ప్ర‌త్యేక స్థాన‌మే ఉంద‌ని చెప్పాలి.. అయితే, వీటి ధ‌ర‌కు కూడా భారీగానే ఉంటుంది. కానీ, ఐఫోన్ వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ యాపిల్.. కొన్ని ఐఫోన్ల ధరలను తగ్గించినట్లు యాపిల్ ప్ర‌క‌టించింది.. ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11 మోడ‌ల్స్ స్మార్ట్‌ఫోన్ల ధరలను త‌గ్గిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. 

64 జీబీ వేరియంట్ ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.52,500 ఉండ‌గా.. త‌గ్గించిన ధ‌ర ప్ర‌కారం.. దానిని రూ. 47,900కే పొంద‌వ‌చ్చు.. 64 జీబీ వేరియంట్ ఐఫోన్ ఎస్ఈ మోడ‌ల్ ధ‌ర ప్రస్తుతం రూ. 42,500గా ఉండ‌గా.. స‌వ‌రించిన ధ‌ర ప్ర‌కారం.. రూ.39, 900కే లభించనుంది. 128 జీబీ వేరియంట్ ధ‌ర రూ.47,800 ఉండగా.. త‌గ్గిన ధ‌ర‌తో రూ.44,900కే సొంతం చేసుకోవ‌చ్చు.. 256జీబీ వేరియంట్ ఫోన్ ధ‌ర‌ రూ. 58,300గా ఉంటే..  ఇప్పుడు రూ.54,900కే లభించనుంది. ఇక‌, ఐఫోన్ 11 ధ‌ర రూ.68,300 ఉంటే..  ఆఫ‌ర్‌లో రూ. 54,900కే అందుకునే అవ‌కాశం క‌ల్పించింది యాపిల్. మొత్తానికి ఐఫోన్ కోసం చూస్తున్న‌వారికి ఇది శుభ‌వార్త అనే చెప్పాలి.