డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్... 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్... 

ఏపీలోని డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది.  ఈరోజు వైఎస్ఆర్ సున్నావడ్డీ పధకం కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి రుణాల వడ్డీని జమచేయనున్నారు.  దీనికోసం ప్రభుత్వం 1,109 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.  9.35 లక్షల డ్వాక్రా మహిళల సంఘాల్లోని 1.02 కోట్ల మంది మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ కాబోతున్నది.  తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ రుణాల వడ్డీని రిలీజ్ చేయబోతున్నారు.  2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.246.15 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు.