క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. రాబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో 50 శాతం ఫాన్స్ ని  మ్యాచ్ చూసేందుకు అనుమతించాలనే ఆలోచనతో బిసిసిఐ ఉన్నట్టు చెబుతున్నారు. మ్యాచ్ జరిగే అన్ని వేదికలలో అంటే చెన్నై, అహ్మదాబాద్ మరియు పూణే ఇలా అన్ని చోట్లా అభిమానులను అనుమతిస్తారు. చివరిసారిగా భారత్ లో ఆడియన్స్ ని 2020 జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా… భారత్ వన్డే సిరీస్ కి అనుమతించారు. ఆ తరువాత జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కూడా ఫాన్స్ లేకుండానే జరిగింది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కూడా అభిమానుల హాజరు కాకుండానే జరుగుతోంది. ఇప్పుడు మరలా ఆడియన్స్ ని అలో చేయడంతో ఆస్ట్రేలియా తరువాత అభిమానులను స్టేడియంలోకి అనుమతించే మొదటి అతి పెద్ద క్రికెట్ దేశం భారత్ నిలవనుంది.