మ‌రో శుభ‌వార్త చెప్పిన సీఎం జ‌గ‌న్

మ‌రో శుభ‌వార్త చెప్పిన సీఎం జ‌గ‌న్

వ‌రుస సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్... క‌రోనావైర‌స్ వ్యాప్తితో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో వెనుక‌డుగు వేయ‌కుండా ముందుకు వెళ్తున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. తాజాగా, పొగాకు రైతులకు శుభవార్త చెప్పింది వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్.. ఇకపై ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇవాళ్టి నుంచి పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్ల‌డించారు. ప్ర‌కాశం జిల్లా ఒంగోలులోని 1, 2 కేంద్రాల ద్వారా ఇవాళ పొగా కొనుగోళ్లు ప్రారంభిస్తామ‌ని.. ఆ తర్వాత అన్ని కేంద్రాల్లో ఈ కొనుగోళ్లు చేపడుతామని తెలిపారు మంత్రి. ఇక‌, ఎఫ్‌3, ఎఫ్‌4, ఎఫ్‌5, ఎఫ్‌8, ఎఫ్‌9 గ్రేడు పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద‌ని చెప్పిన మంత్రి క‌న్న‌బాబు.. పొగాకు బోర్డు  నిర్ణ‌యించిన దానికంటే ఎక్కువ మొత్తానికి కొనుగోళ్లు చేస్తామ‌న్నారు. మొత్తానికి పొగాకు రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్.