తీపి క‌బురు.. డీజిల్‌పై ఏకంగా రూ.8 త‌గ్గింపు..!

తీపి క‌బురు.. డీజిల్‌పై ఏకంగా రూ.8 త‌గ్గింపు..!

క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత వ‌రుస‌గా పెట్రో ధ‌ర‌లు పెరిగిపోయాయి... పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆల్‌టైం హైకి చేరాయి... దీంతో.. బైక్‌లు, కార్లు బ‌య‌ట‌కు తీయాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితి.. ఇక‌, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో డీజిల్ ధ‌ర‌లు ఏకంగా పెట్రోల్ రేట్‌ను క్రాస్ చేశాయి.. ఈ స‌మ‌యంలో వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది ప్ర‌భుత్వం.. ఇది దేశ్యాప్తంగా అని సంబ‌ర‌ప‌డ‌కండి.. అదేదో ఏపీ, తెలంగాణ‌లో అని ఆనంద‌ప‌డ‌కండి.. ఎందుకంటే.. ఇది ఢిల్లీలో మాత్ర‌మే.

డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ స‌ర్కార్‌... దీంతో డీజిల్ ధర ఏకంగా రూ.8కు పైగా త‌గ్గిపోనుంది.. ఇది కూడా రేప‌టి నుంచే అమ‌ల్లోకి రానుంది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ స‌ర్కార్‌.. డీజిల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించింది. ఆ నిర్ణ‌యానికి కేబినెట్ కూడా ఆమోద‌ముద్ర వేసింది.. దీంతో.. రేప‌టి నుంచి కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి రానున్నాయి.. ఈరోజు ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు రూ.81.94గా ఉంది. అయితే, వ్యాట్‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో.. ఢిల్లీలో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ .73.94కు దిగిరానుంది.