భారీగా తగ్గిన బంగారం...ధరలు పెరగడానికి కారణాలు ఇవే

భారీగా తగ్గిన బంగారం...ధరలు పెరగడానికి కారణాలు ఇవే

బులియన్‌ మార్కెట్‌ కళ తప్పుతోంది...కరోనా కారణంగా మార్కెట్‌ నీరసించడంతో పసిడి దిగుమతులు కూడా తగ్గుతున్నాయి...భారత దేశంలో బంగారానికి మించిన విలువైన వస్తువు ఏదీ లేదు...కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థతో పాటు బంగారం దిగుమతులపై కూడా తన ప్రతాపాన్ని చూపించింది...ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ మొదటి వరుసలో ఉంటుంది...కాని గత కొద్ది నెలలుగా భారత్‌లో బంగారం దిగుమతులు తగ్గాయి..

ఏప్రిల్‌ నెలలో బంగారం దిగుమతులు పూర్తిగా పడిపోయాయి...వరుసుగా  దేశంలో బంగారం దిగుమతుల పడిపోవగడం వరుసగా ఇది సారి....కరోనా వల్ల దేశ వాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఏప్రిల్‌ నెలలో బంగారం దిగుమతులు రూ.21 కోట్లకు పడిపోయాయి...కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం గతేడాది ఇదే సమయంలో రూ.29,775 కోట్ల విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయ్యింది... అంటే ఈ గణాంకాలను బట్టి దిగుమతులు వంద శాతం పడిపాయాయని అర్థమవుతున్నది...బంగారం దిగుమతులు పడిపోవడంతో దేశీయ వాణిజ్యలోటు 15.33 బియిలన్‌ డాలర్ల నుంచి 6.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది...

కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి  దేశంలో బంగారం దిగుమలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. దేశంలో బంగారం దిగుమతులు ఏడాదికి 800 టన్నుల నుంచి 900 టన్నుల మధ్య ఉంటుంది...ఇందులో కొంత భాగాన్ని నగలుగా మార్చి ఎగుమతి చేస్తుంటారు...కానీ ఏప్రిల్‌లో ఇది 98.74 శాతం పడిపోయి 36 మిలియన్‌ డాలర్లుగా మాత్రమే ఉంది...

మరొవైపు అమెరికా-చైనా మధ్య  జరుగుతున్న ట్రేడ్ వార్‌ కూడా బంగారం దిగుమతులపై పడిందంటున్నారు విశ్లేషకులు..కరోనా లాక్‌డౌన్‌ వల్ల అనేక శుభకార్యాలు వాయిదా పడటం మరో కారణం...ఇకపోతే బంగారం దిగుమతులపై  ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి...
పసిడి దిగుమతులపై దిగుమతి సుంకాన్ని పెంచడం పరిశ్రమ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది... సుంకాలు పెంచడంపై పరిశ్రమ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి... ఈ భారం తగ్గించుకునేందుకు కొంత మంది ఆభరణాల ఎగుమతిదారులు పన్నులు తక్కువగా ఉండే పొరుగు దేశాలకు తమ వ్యాపారాలను మార్చారు. దీనికి తోడు ఆర్థిక మందగమనంతో దేశీయ కొనుగోళ్లూ నీరసించాయి. ఇవన్నీ పసిడి దిగుమతులను దెబ్బతీస్తున్నాయి..