గుడ్‌న్యూస్.. బంగారం ధర పడిపోయింది..!

గుడ్‌న్యూస్.. బంగారం ధర పడిపోయింది..!

అంతర్జాతీయ పరిస్థితులతో దేశీయంగా అమాంతం పెరిగిన బంగారం ధర.. కొత్త రికార్డులు సృష్టించేవైపు కదిలింది.. ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ తగ్గుముఖం పట్టింది.. వరుసగా మూడో రోజు కూడా పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా.. దేశీయంగా బంగారం ధర కిందకు దిగడం శుభపరిణామమే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.. బంగారం కొనేవారికి ఇదే సరైన సమయ అని కూడా సూచిస్తున్నారు. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.370 క్షీణించి.. రూ.44,870కు తగ్గగా.. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.370 తగ్గుదలతో రూ.48,680గా పలికింది.. మరోవైపు.. వెండి ధర మాత్రం పైపైకి ఎగబాకుతూనే ఉంది.. కేజీ వెండి ధర స్వల్పంగా పెరగడంతో కిలో వెండి ధర రూ.48,250కు చేరింది.. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.74 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1734.70 డాలర్లకు చేరింది.