భారీగా పెరిగిన బంగారం ధరలు...
గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. బంగారం ధరలు దేశంలో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటుగా బంగారంకు క్రమంగా డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.460 పెరిగి రూ.48,160కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.52,530కి చేరింది. నిన్నటి వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ. 2700 పెరిగి రూ.60,700కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)