మళ్ళీ పెరిగిన బంగారం ధరలు... 

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు... 

కరోనా లాక్ డౌన్ తరువాత బంగారం ధరలు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.  ధరలు పెరుగుదలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.  నిన్నటి రోజున తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  350 పెరిగి రూ.47,050కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగి రూ.51,330కి చేరింది.  ఇక బంగారంతో పాటుగా వెండి ధర కూడా భారీగా పెరిగింది.  కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.63,500 కి చేరింది.  నాణేల పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధరలు పెరిగినట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.