గుడ్‌ న్యూస్‌ : భారీగా పడిపోయిన బంగారం ధరలు

గుడ్‌ న్యూస్‌ : భారీగా పడిపోయిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి.  గత మూడు, నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు తిరిగి తగ్గుముఖం పట్టాయి.  దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా, అంతర్జాతీయంగా కూడా ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  350 తగ్గి రూ. 43,400కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి రూ.47,350 కి చేరింది. బంగారం తగ్గితే... వెండి ధర మాత్రం భారీగా పెరిగిపోయింది.  కిలో వెండి ధర రూ. 700 పెరిగి రూ.74,300కి చేరింది.