మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

దేశంలో మహిళలు బంగారానికి ఎక్కువగా విలువ ఇస్తారు.  ప్రతి చిన్న వేడుకలకు బంగారం కొనుగోలు చేస్తుంటారు.  ప్రపంచంలో  బంగారాన్ని   వినియోగించే దేశాల్లో ఇండియా ఒకటి.  దీంతో బంగారానికి ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది.  ఇక, హైదరాబాద్ లో ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 490 పెరిగి రూ.48,400కి చేరింది.  ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 పెరిగి రూ. 52,800కి చేరింది.  బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది.  కిలో వెండి ధర రూ. 1200 పెరిగి రూ.72,500కి చేరింది.