మళ్ళీ పెరిగిన బంగారం ధరలు...
దేశంలో మహిళలు బంగారానికి ఎక్కువగా విలువ ఇస్తారు. ప్రతి చిన్న వేడుకలకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో ఇండియా ఒకటి. దీంతో బంగారానికి ఇండియాలో భారీ డిమాండ్ ఉంటుంది. ఇక, హైదరాబాద్ లో ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.45,800కి చేరింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160పెరిగి రూ.49, 800కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.600పెరిగి రూ.71,300కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)