గుడ్‌ న్యూస్‌ : మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు..

గుడ్‌ న్యూస్‌ : మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు..

భారతదేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.  అందుకే బంగారానికి దేశంలో డిమాండ్ అధికంగా ఉంటుంది.  ధరలు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయి.  ఏ మాత్రం ధరలు తగ్గినా, పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోలు జరుగుతుంది. అయితే.. కరోనా విజృంభణ తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే.. ఆల్‌ టైం రికార్డుకు చేరుకున్నాయి బంగారం ధరలు. తాజాగా.. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం ఇండియన్ బులియన్ మార్కెట్లపై పడింది.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 45, 450కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 180 తగ్గి రూ. 49,580 కి చేరింది.  ఇక వెండి కూడా ఇదే బాటలో నడిచింది.  కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 64,700కి చేరింది.