మహిళలకు గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు... 

మహిళలకు గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధరలు... 

భారతదేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.  అందుకే బంగారానికి దేశంలో డిమాండ్ అధికంగా ఉంటుంది.  ధరలు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయి.  ఏ మాత్రం ధరలు తగ్గినా, పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోలు జరుగుతుంది.  అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం ఇండియన్ బులియన్ మార్కెట్లపై పడింది.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 900 తగ్గి రూ. 46,200కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.980 తగ్గి రూ.50,400కి చేరింది.  ఇక వెండి కూడా ఇదే బాటలో నడిచింది.  కిలో వెండి ధర రూ.2,200 తగ్గి రూ. 64,500కి చేరింది.