కార్తీకమాసం తొలిరోజున షాకిచ్చిన పుత్తడి... భారీగా పెరిగిన ధరలు...

కార్తీకమాసం తొలిరోజున షాకిచ్చిన పుత్తడి... భారీగా పెరిగిన ధరలు...

బంగారం ధర మళ్ళీ పరుగులు పెడుతున్నది.  ధనత్రయోదశి, దీపావళి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  కార్తీక మాసం తొలిరోజైన సోమవారం రోజున కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరిగి రూ.47,710కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.52,050కి చేరింది. ఇక వెండి కూడా ఇదే బాటలో నడిచింది.  కిలో వెండి ధర రూ. 290 పెరిగి రూ.63,600కి చేరింది.