గుడ్ న్యూస్: మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
బంగారానికి దేశంలో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి చిన్న శుభకార్యానికి బంగారం కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, కరోనా సమయంలో బంగారం ధరలు అమాంతంగా కొండెక్కాయి. ఆగష్టు నెలలో ఈ ధర రికార్డ్ స్థాయికి చేరింది. ఆ తరువాత క్రమంగా తగ్గడం మొదలుపెట్టింది. గత వారం వెయ్యి రూపాయలకు పైగా బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. తగ్గిన ధరలను బట్టి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,800కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 తగ్గి రూ.52,140కి చేరింది. ఇక వెండి కూడా ఇదే బాటలో నడిచింది. కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.59,000 కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)