శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు... 

శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు... 

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి.  అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది.  శుక్రవారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గి రూ.49,090కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.53,550కి చేరింది.  ఇక వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి.  కిలో వెండి ధర రూ.1200 తగ్గి రూ.67,800కి చేరింది.