దిగొస్తున్న పుత్తడి...
దేశంలో పుత్తడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మూడు రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మంగళవారం రోజున కూడా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గింది. అటు వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 660 తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దీనికి ఒక కారణమైతే, కోవిడ్ తరువాత ప్రపంచ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మరొక కారణం అని నిపుణులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)