గుడ్ న్యూస్: దిగొచ్చిన బంగారం ధరలు 

గుడ్ న్యూస్: దిగొచ్చిన బంగారం ధరలు 

కరోనా, లాక్ డౌన్ సమయంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.  బంగారం కొనుగోలు లేకపోయినప్పటికీ ధరలు మాత్రం అమాంతంగా పెరిగాయి. లాక్ డౌన్ తరువాత పెరిగిన ధరలు క్రమంగా తగ్గడం మొదలుపెట్టాయి.  ఆగష్టు నెలలో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.  అయితే, గార రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా ధరలు తగ్గడం విశేషం.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.80 తగ్గి రూ.48,900 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 తగ్గి రూ. 53,350కి చేరింది.  ఇక వెండి ధరలు కూడా తగ్గింది.  కిలో వెండి ధర రూ.80 తగ్గి రూ.67,900 కి చేరింది.