భారీగా పెరిగిన బంగారం ధరలు... 

భారీగా పెరిగిన బంగారం ధరలు... 

మగువలకు అత్యంత ఇష్టమైన వస్తువు బంగారం.  పండగ వస్తే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ మాసంలో బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.  అయితే, ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం చాలా కష్టంగా మారింది.  ధరలు చుక్కలను తాకుతున్నాయి.  

10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.58,300కి చేరింది.  ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ ధర అని చెప్పాలి.  గత వారం రోజుల్లో బంగారం ధర మూడుసార్లు పెరిగింది.  రోజుకు రూ.800కి పైగా ధర పెరుగుతున్నది.  రాబోయే రోజుల్లో ఈ ధర రూ. 65 వేలకు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఇక ఇదిలా ఉంటె అటు వెండి కూడా చుక్కలు చూపిస్తోంది.  కిలో వెండి ధర రూ.  78,300కి చేరడం విశేషం.  అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటుగా, డాలర్ తో రూపాయి విలువ క్షిణించడం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణం అని అంటున్నారు నిపుణులు.