భారీగా పెరిగిన బంగారం ధరలు... 

భారీగా పెరిగిన బంగారం ధరలు... 

గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.  ఇప్పటికే ధరలు రికార్డ్  స్థాయికి చేరుకున్నాయి.  అంతర్జాతీయంగా డిమాండ్ ధరలు పెరగడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరాటం, కరోనా ప్రభావం పసిడిపై పడింది.  ఇక దేశీయంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 51,800కి చేరింది.  ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 56,590కి చేరింది.  ఇదే ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ ధర అని చెప్పొచ్చు.  ఇక ఇదిలా ఉంటె, బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.  కిలో వెండి ధర రూ. 290 పెరిగి రూ.65,400కి చేరింది.