పరుగులు తీస్తున్న పుత్తడి...
దేశంలో పుత్తడి ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్నటి నుంచి షాక్ ఇవ్వడం మొదలుపెట్టాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ముదుపరులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో బంగారం ధరలు మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి. నిన్న రూ.800 వరకు పెరిగిన బంగారం ధరలు, ఈరోజు రూ.600కి పైగా పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.42,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ.46,090కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.1300 మేర పెరిగి రూ.70,000కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)