గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

దేశంలో బంగారం ధరలు నిన్నటి రోజున పెరిగిన సంగతి తెలిసిందే.  కాగా, నిన్న పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.  తగ్గిన ధరలను బట్టి ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం విలువ ఎంత ఉన్నదో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.41,800కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.45,600కి చేరింది.  ఇక బంగారంతో పాటుగా వెండి కూడా భారీగా తగ్గింది.  కిలో వెండి ధర రూ.2400 తగ్గి రూ.70,400కి చేరింది.  అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై పడింది.