గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

నిన్నటి రోజున పెరిగిన బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.  వెయ్యిరూపాయలు పైగా ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు. మార్కెట్లు బలంగా ఉండటంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 తగ్గి రూ. 42,100కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1040 తగ్గి రూ.45,930కి చేరింది.  పుత్తడి ధరలు తగ్గిపోవడంతో అదే బాటలో వెండి కూడా నడిచింది.  కిలో వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000 కి పడిపోయింది.