గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు...
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో కొనుగోలు చేయడం ఉత్తమం. దేశీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 తగ్గి రూ.42,700కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గి రూ.46,580కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.800 తగ్గి రూ.72,500కి చేరింది. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతుండటంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)