స్థిరంగా బంగారం, వెండి ధరలు...

స్థిరంగా బంగారం, వెండి ధరలు...

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం నిలకడగా ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆకాశాన్ని తాకిన ధరలు ఆ తరువాత మార్కెట్లు తిరిగి కోలుకొని పుంజుకోవడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. అయితే సోమవారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 44,250 కి చేరగా...  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,290 కి చేరింది. అయితే... బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 73,900 పలుకుతోంది.