గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర... 

గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర... 

లాక్ డౌన్ కాలంలో బంగారం గురించి భారతీయులు పెద్దగా పట్టించుకోలేదు.  బంగారం కొనుగోలు చేయాలి అనుకున్నా షాపులు వంటివి లేకపోవడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.  లాక్ డౌన్ సడలింపులు కారణంగా ఇప్పుడిప్పుడే షాపులు తెరుచుకుంటున్నాయి.  ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతున్నది.  ఆర్ధిక పరిస్థితి గాడిన పడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తిరిగి పెరుగుతాయని అనుకున్నారు.  

కానీ, అనూహ్యంగా ధరలు తగ్గడం మొదలుపెట్టాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  120 తగ్గి రూ.44,560కి చేరింది.  10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర రూ. 140 తగ్గి రూ.48,640కి తగ్గింది.  ఇక కిలో వెండిధర రూ. 400 తగ్గి రూ. 48,500కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గిపోవడమే ఇందుకు కారణం అని నిపుణులు చెప్తున్నారు.