మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర

మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర

పసిడికొనాలని చూస్తున్న మగువలకు శుభవార్త.. పసిడి ధర భారీ తగ్గింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.410 తగ్గడంతో రూ.45,900కు పడిపోయింది.. ఇక, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 దిగిరావడంతో.. రూ.50,070కి  పరిమితమైంది.. అయితే, వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది.. రూ.600 పైకి కదిలి.. కిలో వెండి ధర రూ.69,600కు చేరింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర దిగివచ్చింది.. బంగారం ధర ఔన్స్‌కు 0.33 శాతం తగ్గుదలతో 1844 డాలర్లకు పడిపోగా.. ఔన్స్‌కు 0.77 శాతం తగ్గుదలతో 25.09 డాలర్లకు పడిపోయింది వెండి ధర..