గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన పసిడి ధర

గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన పసిడి ధర

పసిడి ధరలు ఓసారి కిందకు.. మరోసారి పైకి కదులుతూనే ఉన్నాయి... మరోసారి బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి కాస్త ఊరట కలిగించాయి బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గడంతో రూ.51,720కు పడిపోయింది.. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.320 కిందకు దిగడంతో రూ.47,410కి పరిమితమైంది.. అయితే, వెండి ధర మాత్రం పైకే కదిలింది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,300 పెరిగి.. రూ.64,700కు పరుగులు పెట్టింది.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకే కదిలాయి..  బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 1874 డాలర్లకు పెరగగా.. వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం పెరుగుదలతో 23.51 డాలర్లకు చేరింది.